ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు

SMTV Desk 2019-06-04 16:02:40  trs, congress , bjp,

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టడంతో మెలమెల్లగా ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఉదయం 10.00 గంటల వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో తెరాసకు 91 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, కాంగ్రెస్‌, బిజెపిలు చెరో ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొన్నాయి. ఇతరులు 2 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకొన్నారు. జిల్లాల వారీగా చూసినట్లయితే తెరాస రంగారెడ్డి:1, సంగారెడ్డి: 1, కరీంనగర్‌: 1, మహబూబ్‌నగర్‌:1, నాగర్ కర్నూల్‌: 2, వికారాబాద్: 2, వరంగల్‌ రూరల్: 3, జోగులాంబ గద్వాల్: 3, మంచిర్యాల: 4, ఖమ్మం: 5, జయశంకర్ భూపాలపల్లి: 7, జగిత్యాల: 8, కామారెడ్డి: 17, మహబూబాబాద్: 15 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకొంది. ఆసిఫాబాద్: 1, నిజామాబాద్‌: 1, జగిత్యాల: 2 జెడ్పీటీసీ స్థానాలను తెరాస గెలుచుకొంది.