అశ్వద్ధామ మూవీ తో హిట్ కొడతాడా...

SMTV Desk 2019-06-04 15:58:29  Aswaddama, Naga Shaurya,

ఛలో సూపర్ హిట్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నాగ శౌర్య ఆ తర్వాత రెండు సినిమాలు మళ్లీ నిరాశపరచడంతో ఢీలా పడ్డాడు. ప్రస్తుతం అతని నిర్మాణంలోనే ఓ సినిమా తెరకెక్కుతుంది. రమణతేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా అశ్వద్ధామ అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ బి. గోపాల్ డైరక్షన్ లో ఇదే టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా కమర్షియల్ హిట్ సాధించింది.

నాగశౌర్య అశ్వద్ధామ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా సమంత లీడ్ రోల్ లో నటించిన ఓ బేబీ సినిమాలో కూడా నటించాడు నాగ శౌర్య. ఆ సినిమాలో హీరోయిన్ సమంత అయినా నాగ శౌర్యకు మంచి పాత్ర దొరికినట్టు తెలుస్తుంది. ఛలో తర్వాత రెండు సినిమాలు ఇచ్చిన షాక్ తో సెట్ రైట్ అయిన నాగ శౌర్య తన తర్వాత సినిమాల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు