వజ్రకవచధర గోవింద ట్రైలర్ చూసారా ...

SMTV Desk 2019-06-04 15:40:30  vajravachakadara govinda trailer,

కమెడియన్ సప్తగిరి అప్పుడప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్.ఎల్.బి సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమా చేస్తున్నాడు సప్తగిరి. అరుణ్ పవార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు వజ్రకవచధర గోవింద టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు సంబందించిన్ ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు.
సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సప్తగిరి ఎప్పటిలానే తన డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. కమెడియన్ హీరోగా అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు ఓ స్టార్ హీరో సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా అలరించేలా ఉంటుందని తెలుస్తుంది. శివ శివం ఫిలంస్ బ్యానర్ లో జివిఎన్ రెడ్డి, ఈదల నరేంద్ర ఈ సినిమా నిర్మిస్తున్నారు. సప్తగిరి సరసన వైభవి జోషి హీరోయిన్ గా నటిస్తుంది.