శృతి హాసన్ న్యూ ఇన్నింగ్స్ స్టార్ట్

SMTV Desk 2019-06-04 15:39:29  sruthi hasan,

స్టార్ హీరో కమల్ హాసన్ తనయురాలిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. కొంతకాలంగా తన ఇటాలియన్ బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన శృతి హాసన్ పెళ్లి పీటలెక్కుతుందని అనుకోగా.. ఆ జంట ఎవరి దారి వారు చూసుకున్నారు. హీరోయిన్ గా మంచి అవకాశాలు వచ్చినా సరే వాటిని కాదనుకున్న శృతి హాసన్ మళ్లీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది.

అందులో భాగంగా శృతి హాసన్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందట. రవితేజ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను సెలెక్ట్ చేశారట. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెట్ త్వరలో రానుంది. ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. వీఇ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది.