మెక్సికోపై ట్రంప్ పన్నుల ఆంక్షలు...నిరసనలు వ్యక్తం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు

SMTV Desk 2019-06-04 15:04:58  5% tax on mexico imported products, mexico

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెక్సికో నుండి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై 5శాతం పన్నులను విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనపై స్కాలర్స్‌ ఎట్‌ అట్లాంటిక్‌ కౌన్సిల్‌ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన మేధావులు తీవ్ర నిరసన తెలియజేశారు. ఈ కౌన్సిల్‌ అడిన్ర్‌ అర్షత్‌ లాటిన్‌ అమెరికా సెంటర్‌ డైరెక్టర్‌ జాసన్‌ మార్క్‌జాక్‌ ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెక్సికన్‌ దిగుమతులపై సుంకాల పెంపు ప్రతిపాదన కేవలం బెదిరింపు మాత్రమేనేని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నిజానికి ఈ సుంకాల పెంపుదలవల్ల అమెరికాకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉండబోవని ఆయన అన్నారు.