ప్లాస్టిక్ సర్జరీతో సిక్స్ ప్యాక్!

SMTV Desk 2019-06-04 15:03:58  thailand guy get six pack in plastic surgery

థాయ్‌లాండ్‌: పురుషుల్లో దాదాపు అందరూ సిక్స్ ప్యాక్ రావాలని కోరుకుంటారు. కాని అందులో సగం నదికి జిమ్ కు వెళ్లి కష్టపడడానికి మనసు ఒప్పదు. కానీ థాయ్‌లాండ్‌కు చెందిన పంగ్‌పార్న్ అన్విలాయ్ అనే యువకుడు ఇవేమి చేయకుండానే సిక్స్ ప్యాక్ సంపాధించాడు. బ్యాంకాక్‌లోని మాస్టర్ పీస్ కాస్మొటిక్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. ఎన్నో ఏళ్లుగా సిక్స్ ప్యాక్ కోసం ట్రే చేస్తున్నానని, కానీ ఆ షేప్ రావడం లేదని తెలిపాడు. దీంతో ప్లాస్టిక్ సర్జన్ వైద్యుడు అతిత్తయపా పొతియా అతడికి లైపోసక్షన్ (liposuction) విధానంలో పొత్తి కడుపు వద్ద ఉన్న కొవ్వును తొలగించారు. కొవ్వును తొలగించిన ప్రాంతాన్ని బ్యాండేజ్‌లతో మూసేశారు. సిలికాన్, ప్లాస్టిక్‌లను వాడకుండానే శస్త్ర చికిత్స పూర్తి చేశారు. కొద్ది నెలల తర్వాత అన్విలాయ్ కడుపుపై సిక్స్ ప్యాక్స్ వచ్చింది. దీంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఈ చికిత్స చేసేటప్పుడు నొప్పి అధికంగా ఉంటుందని, ఇది అందరికీ చేయడం కుదరదని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సర్జరీ చేయించుకునే వారు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతీ రోజు మంచి ఆహారం తీసుకుంటుండాలని, పొట్ట పెరగకుండా జాగ్రత్తపడాలన్నారు. ఈ చికిత్స చేయించుకునే వ్యక్తి లావైతే సర్జరీ చేసిన ప్రాంతంలో కొవ్వు పెరిగి ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందన్నారు. ‘సిక్స్ ప్యాక్ – ఓపీ’గా పేర్కొనే ఈ సర్జరీ చేయించుకునే వారు దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుసుకోవాలని, అలా చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమని సూచిస్తున్నారు.