మరో రూ.70 కోట్ల షేర్లను సొంతం చేసుకున్న ఎల్అండ్ టి

SMTV Desk 2019-06-04 15:01:33  l and t

న్యూఢిల్లీ: ఎల్అండ్ టి మరో రూ.70 కోట్ల విలువచేసే మైండ్‌ట్రీ షేర్లను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. మే 27 నుంచి 30 తేదీల మధ్య 7.11 లక్షల మైండ్‌ట్రీ షేర్లను సొంతం చేసుకున్నట్టు ఈ విషయాన్నీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎల్ అండ్ టి వెల్లడించింది. బెంగళూరుకు చెందిన మైండ్‌ట్రీ సంస్థలో కాఫీ డే వ్యవస్థాపకుడు విజి సిద్ధార్థకు ఉన్న 20 శాతం వాటాలను గత నెలలో ఎల్ అండ్ టి సొంతం చేసుకుంది. మైండ్‌ట్రీలో66 శాతం వాటాలను సొంతం చేసుకోవాలని ఎల్ అండ్ టి భావిస్తోంది. ‘మైండ్ ట్రీ’ను టేటీ’ను చేయడమే తమ తొలి ప్రాధాన్యమని ఇటీవల ఎల్ అండ్ టి గ్రూప్ ఛైర్మన్ ఎఎం నాయక్ చెప్పారు. మైండ్ ట్రీని పెద్ద సంస్థగా తీర్చిదిద్దుతామని అన్నారు. మైండ్ ట్రీలో మొత్తం వాటాను దాదాపు 26 శాతానికి పెంచుకున్నామని, అదనపు వాటా కొనుగోలు చేయడానికి వచ్చే 10 రోజుల్లో ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు తెలిపారు. మైండ్‌ట్రీని కొనుగోలు చేసిన తర్వాత ఐటి, ఇంజనీరింగ్ సర్వీసులో కంపెనీ 300 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అన్నారు. వచ్చే మూడునాలుగేళ్లలో దీన్ని 500 కోట్ల డాలర్లకు చేర్చాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. విజి సిద్ధార్థ, కేఫ్ కాఫీ డేకు ఉన్న 20.34 శాతం వాటాను రూ.3,210 కోట్లకు ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత నుంచి క్రమంగా షేర్లను కొనుగోలు చేస్తోంది. మొత్తంగా మైండ్‌ట్రీలో 66 శాతం వరకు వాటాను కొనుగోలు చేయాలన్నది ఎల్ అండ్ టి లక్ష్యంగా ఉంది. ఈ వాటా విలువ దాదాపు రూ.10,800 కోట్ల వరకు ఉంటుంది.