సెరెనా వస్తే నేను వెళ్ళిపోవాలా?

SMTV Desk 2019-06-04 15:00:30  Serena Williams, dominic thiem

ఆస్ట్రియా స్టార్‌ డొమినిక్‌ థీమ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో సీడ్‌ థీమ్‌ మూడో రౌండ్‌ గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ప్రధాన మీడియా హాల్‌లో థీమ్‌.. తన ఆట గురించి విలేకర్లతో ముచ్చటిస్తున్నాడు.అదే సమయంలో మూడో రౌండ్లో ఓడిపోయిన అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్‌ కూడా మీడియా సమావేశం కోసం ఆ హాల్‌ దగ్గరకు వచ్చింది. 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత సెరెనా వేచి ఉండడంతో.. థీమ్‌ తన ప్రసంగాన్ని త్వరగా ముగించుకొని వెళ్లాలని టోర్నీ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వెంటనే థీమ్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెరెనా విలియమ్స్‌ వస్తే.. నేను నా ప్రసంగాన్ని మధ్యలోనే ముగించాలా?. ఒక ఆటగాడికి ఇచ్చే మర్యాద ఇదేనా? అని థీమ్‌ మండిపడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సెరెనా.. ప్రధాన హాల్‌ లేకపోయినా ఏదో గదిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. నిర్వాహకులు వేరే గదిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో సెరెనా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే పలువురు దిగ్గజాలు, మాజీలు థీమ్‌కు అండగా నిలబడ్డారు.