18 కంపెనీలపై సెబీ నిషేధం..

SMTV Desk 2017-08-29 12:16:45  STOCK EXCHANGE COMPANIES, SEBI BAN ON 18 COMPANIES

న్యూఢిల్లీ, ఆగస్ట్ 29 : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సంస్థ ఇటీవలే 200 కంపెనీలను డీలిస్ట్ చేసి౦ది. చట్ట వ్యతిరేకంగా ట్రేడింగ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలతో ఈ కంపెనీ ప్రమోటర్లు, సెక్యూరిటీస్ మార్కెట్లో అడుగు పెట్టకుండా వచ్చే పదేళ్ళ వరకు నిషేధం విధించినట్టు సమాచారం. ఈ కంపెనీల్లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతున్నట్లు విచారణలో తేలింది. ఇక ఈ 200 కంపెనీల్లో 18 కొత్త తరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. *1985 లో స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీగా ప్రారంభమైన నెట్ కామ్ లిమిటెడ్ *కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ డెవలపర్ స్కింటిల్లా సాఫ్ట్ వేర్ టెక్నాలజీ *చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టెలీడేటా ఇన్ఫర్మాటిక్స్ *ముంబై కేంద్రంగా పనిచేస్తున్న వెబ్ అండ్ వ్యాప్ ప్రొడక్టుల సంస్థ ఆడమ్ కామ్సాఫ్ లిమిటెడ్ *కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న ఏఎంఐ కంప్యూటర్స్ (ఇండియా) లిమిటెడ్ *నెట్ వర్కింగ్, హోస్టింగ్ సేవల సంస్థ సీఎస్జే టెక్నాలజీస్ *ఎంటర్ ప్రైజ్ పోర్టల్స్ అభివృద్ధి సంస్థ సీక్వెల్ సాఫ్ట్ ఇండియా లిమిటెడ్ *స్మాల్ అండ్ మీడియం ఐటీ కంపెనీ సాఫ్ట్ ట్రాక్ టెక్నో *కంప్యూటర్ హార్డ్ వేర్, మానిటర్స్, పీసీబీల తయారీ సంస్థ యూనీపోర్ట్ కంప్యూటర్స్ *కన్సల్టెన్సీ సేవల సంస్థ కావేరీ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ *మల్టీమీడియా, ఇంటర్నెట్, ఎంటర్ టెయిన్ మెంట్ సేవల కంపెనీ కంప్యూటైన్ విన్ఫోసిస్టమ్స్ *టెక్నాలజీ సొల్యూషన్స్ సేవల సంస్థ కంప్యూటెక్ ఇంటర్నేషనల్ *చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న మిడ్ క్యాప్ ఐటీ కంపెనీ ధనుష్ టెక్నాలజీస్ లిమిటెడ్ *తొలుత స్క్వేర్ డీ సాఫ్ట్ వేర్ గా ప్రారంభమై ఆపై డీఎస్క్యూ సాఫ్ట్ వేర్ గా మారిన చెన్నై సంస్థ *కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న యూరోపియన్ సాఫ్ట్ వేర్ అలయన్సెస్ లిమిటెడ్ *కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సేవల సంస్థ ఇన్ఫర్మేషనన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్, తొలుత ఈ సంస్థ ఉషా సర్వీసెస్ అండ్ కన్సల్టెంట్స్ పేరిట పనిచేసింది *ఐటీ సేవల సంస్థ నెక్సస్ సాఫ్ట్ వేర్ లిమిటెడ్ *చిన్న తరహా ఐటీ సంస్థ స్కైలిడ్ టెలీకమ్యూనికేషన్ లిమిటెడ్