సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ హషీం ఆమ్లా గాయం నుంచి కోలుకుంటున్నాడని సమాచారం. దీంతో భారత్‌తో మ్యాచ్ వరకు ఆమ్లా పూర్తిగా ఫిట్ నెస్ సాధించి.. ఆ మ్యాచ్‌లో ఆడుతాడని సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్ భావిస్తోంది.ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హషీం ఆమ్లా గాయపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ హెల్మెట్ గ్రిల్‌కు బలంగా తాకడంతో ఆమ్లా గాయపడ్డాడు. వెంటనే అతను మైదానాన్ని వీడడంతో చికిత్స అందించారు. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కష్టాల్లో పడగా.. ఆమ్లా తిరిగి క్రీజులోకి వచ్చినా త్వరగానే పెవిలియన్ చేరాడు.గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో బంగ్లాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ఆమ్లా దూరమయ్యాడు. ఆదివారం మ్యాచ్ జరుగుతున్నపుడు ఆమ్లా డ్రెసింగ్ రూమ్ లో సహచరులతో కలిసి మాట్లాడుతూ కనిపించాడు. అయితే భారత్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌కల్లా ఆమ్లా పూర్తిగా ఫిట్ నెస్ సాధిస్తాడు, ఆ మ్యాచ్‌లో ఆమ్లా ఆడుతాడు అని టీమ్ మేనేజర్ మొహమ్మద్ మూసాజీ చెప్పాడు.