స్విట్జర్లాండ్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

SMTV Desk 2019-06-03 16:24:56  telangana formation day celebrations in switzerland

స్విట్జర్లాండ్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ టీఆర్ఎస్ స్విట్జర్లాండ్ విభాగం అధ్యక్షులు గందె శ్రీధర్ ప్రసంగించారు. గత 5 సంవత్సరాల కాలంలో సిఎం కెసిఆర్‌ గారి నాయకత్వంలో తెలంగాణ అద్భుత అభివృద్ధిని సాధించిందని గుర్తు చేశారు. రైతు బంధు, భీమా, పెన్షన్స్, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వంటి ఎన్నో అద్భితమైన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అందుకే తెలంగాణా ప్రజలు మరొక్క మారు సిఎం కెసిఆర్‌ గారికి అధికారం అప్పగించి తమ విజ్ఞత చాటుకున్నారని తెలిపారు.