బ్రిటన్ లో ట్రంప్ పర్యటన

SMTV Desk 2019-06-03 16:24:24  donald trump in Britain

లండన్‌: నేటి నుండి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్‌ విషయంలో ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్న బ్రిటన్‌కు ట్రంప్‌ తనదైన ఉచిత సలహా ఇచ్చారు. ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే బయటకు రావాలన్నారు.ఆయన బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే వారసుడికి ఈ సలహా ఇచ్చారు. మే వారసుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా ఈయూతో ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా, నిర్భయంగా తిరస్కరించాలన్నారు. బ్రిటన్‌ స్థానంలో నేనే కనుక ఉంటే, అంతపెద్ద మొత్తం చెల్లించేవాడిని కాదని ట్రంప్‌ అంటున్నారు.