డైనమిక్ లీడర్ హరీశ్ రావుకు నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

SMTV Desk 2019-06-03 16:23:05  KTR, Harish rao, Harish rao birthday

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సోమవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపధ్యంలో ఆయనకు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హరీష్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. "గౌరవనీయ సిద్ధిపేట ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్ హరీశ్ రావుకు నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, శాంతి సౌఖ్యాలు కలగాలని, ప్రజాసేవలో మీరు మరింతకాలం గడపాలని కోరుకుంటున్నాను" అన్నారు. కాగా, నేడు హరీశ్ రావు తన బర్త్ డేను నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాను నేడు సిద్ధిపేటలో లేదా హైదరాబాద్ లో ఉండబోవడం లేదని, అభిమానులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని హరీశ్ రావు మూడు రోజుల క్రితమే కోరారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఓ విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. అందులో ‘ మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. రేపు (జూన్ 3) నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. జూన్ 3న నేను హైదరాబాద్ లో కానీ, సిద్ధిపేటలోకానీ ఉండడంలేదు. వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండాల్సి వస్తోంది. నా పట్ల మీ ప్రేమను.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంటున్నా. మీ అభిమానానికి మరోసారి తలవంచి నమస్కరిస్తున్నా. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి ’ అని ట్వీట్ చేశారు.