రానున్న రెండు దశాబ్దాలలో భారత్, చైనాలదే హవా!

SMTV Desk 2019-06-03 16:21:10  global airlines, china, india

న్యూఢిల్లీ: రానున్న రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికుల వృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే ఉంటుంది అని గ్లోబల్ ఎయిర్‌లైన్స్ గ్రూపింగ్ ఐఎటిఎ సంస్థ వెల్లడించింది. విమాన ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటూ వస్తున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే అత్యంత ముందు ఉందని సంస్థ వెల్లడించింది. వరుసగా ఐదేళ్లుగా భారత్‌లో వేగంగా విమానయాన మార్కెట్ వృద్ధిని సాధిస్తోందని ఐఎటిఎ(ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్) ప్రధాన ఆర్థికవేత్త బ్రియాన్ పియర్స్ అన్నారు. అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ సేవలను నిలిపివేయడం, విమాన టికెట్ల రద్దు వంటి కారణాల వల్ల ఏప్రిల్‌లో భారత్‌లో విమాన ప్రయాణికుల వృద్ధి ప్రతికూలంగా మారిందని అన్నారు.ఈ ప్రతికూల వృద్ధి తాత్కాలికమేనని, భారతీయులు ప్రయాణాలకు ఆసక్తి చూపించడం పెరగడం వల్ల మార్కెట్ మరింత విస్తృతం కానుందని ఆయన తెలిపారు. వార్షిక సాధారణ సమావేశంలో ఐఎటిఎ డైరెక్టర్ జనరల్, సిఇఒ అలెగ్జాండర్ డె జునియక్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు అదనపు ప్రయాణికుల డిమాండ్‌ను అందించనున్నాయని అంచనా వేస్తున్నామని అన్నారు. ‘వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రపంచంలో భారత్, చైనా ఈ రెండు దేశాలే 45 శాతం అదనంగా 45 ప్రయాణికుల వాటాలను కల్గి ఉండనున్నాయి. భవిష్యత్‌లో ప్రయాణికుల ఆర్థిక పరిస్థితులు, వారి జీవన శైలిలో మార్పులు రావడమే కారణం’ అని ఆయన అన్నారు.