రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోడిఫైడ్ వెర్షన్!

SMTV Desk 2019-06-03 16:17:45  royal en-field Himalayan modified version

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఎంత పాపులారిటీ తెచ్చుకున్నాయో తెలిసిందే. యువతలో ఈ బైక్స్‌‌కు మాంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోడల్‌లో ఒక మోడిఫైడ్ వెర్షన్ బైక్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ యూకే, స్మోక్‌డ్ గ్యారేజ్ అనే సంస్థలు ఈ బైక్స్‌ను రూపొందించాయి. దీని పేరు హిమాలయన్ ఎస్‌జీ 411. ఎస్‌జీ అంటే స్మోక్‌డ్ గ్యారేజ్ అని అర్ధం. 411 అనేది ఇంజిన్ సామర్థ్యాన్ని సూచిస్తోంది. బైక్‌‌లో హెడ్‌‌లైట్ విషయానికి వస్తే ఇది జెట్ ఫైటర్ స్టైల్ స్ట్రీమ్‌లైన్ డిజైన్‌తో ఉంది. ఈ బైక్ చాలా కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. టైర్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి బైక్ అందాన్ని మరింత పెంచాయి. అలాగే ఫ్యూయెల్ ట్యాంక్ కూడా చూడటానికి చాలా బాగుంది. ఈ మోడిఫైడ్ బైక్ రెట్రో మోడ్రన్ డిజైన్‌తో చూసేవారికి కిక్కెక్కిస్తోంది. ఈ టూవీలర్‌లో సింగిల్ సీట్ మాత్రమే ఉంటుంది. అలాగే ఈ నెక్‌డ్ స్ట్రీట్ ఫైటర్‌లో ఐదు గేర్లు ఉంటాయి.