బౌలింగ్‌ వేస్తానంటే జోకా అన్నారు!

SMTV Desk 2019-06-03 16:17:09  virat kohli, virat bowling

టీంఇండియా కాప్టెన్ విరాట్ కోహ్లి తన బౌలింగ్‌పై జట్టులో ఎవరికీ నమ్మకం లేకపోయినా తనకు ఉందని తెలిపాడు. మొదట బౌలింగ్‌ వేస్తానంటే జోకా అన్నారు. కాని తనపై నమ్మకం ఉందని ఎవ్వరికి ఎవ్వరు చెప్పినా వినేది లేదని స్పష్టం చేశారు. ధోని కాప్టెన్ గ ఉన్నప్పుడు విరాట్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత కోహ్లి కెప్టెన్ అయ్యాక మాత్రం బంతిని పట్టలేదు. అయితే తాను ఎక్కువగా బౌలింగ్‌ చేయకపోవడానికి కారణం జట్టు సభ్యులేనని కోహ్లీ అంటున్నాడు. తాజాగా కోహ్లీ మాట్లాడుతూ... 2017లో శ్రీలంకలో వన్డే సిరీస్‌ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా దాదాపుగా విజయాన్ని ఖరారు చేసుకుంది. అప్పుడు బౌలింగ్‌ చేస్తానని కెప్టెన్ ధోనీని అడగగా.. అతడు సరేనన్నాడు. ఇక చేతులు తిప్పుతూ బంతి వేయడానికి సిద్ధమవుతున్నా. బౌండరీ లైన్‌ వద్ద ఉన్న బుమ్రా అది చూసి.. "జోక్‌ చేయకు. ఇది అంతర్జాతీయ మ్యాచ్‌" అని పెద్దగా అరిచాడు అని కోహ్లీ తెలిపాడు. జట్టులో ఎవరికీ నా బౌలింగ్‌ మీద నమ్మకం లేదు, కానీ నాకుంది. ఆ తర్వాత వెన్నునొప్పి కారణంగా మళ్లీ బౌలింగ్‌ చేయలేదు. డిల్లీలోని అకాడమీలో అండర్సన్‌ బౌలింగ్‌ శైలిని గమనిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత అండర్సన్‌కు ఆ విషయం చెప్పా అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. తాజాగా కోహ్లీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌లో కలిపి విరాట్‌ 8 వికెట్లు తీసాడు. టెస్టుల్లో బౌలింగ్ వేసినా.. వికెట్‌ దక్కలేదు.