కోహ్లి గాయంపై ఆందోళన లేదు: బీసీసీఐ

SMTV Desk 2019-06-03 16:15:26  virat kohli injured his thumb, bcci

టీంఇండియా కాప్టెన్ విరాట్ కోహ్లి చేతివేలికి గాయం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ గాయంపై ఎటువంటి ఆందోళన లేదు లేదు అని బీసీసీఐ స్పష్టం చేసింది. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి బొటనవేలికి గాయమైంది. వెంటనే ఫిజియో కోహ్లి వేలికి పెయిన్ కిల్లింగ్ స్ప్రే వేసి… టేప్ చుట్టారు. అయితే కోహ్లి గాయంపై అభిమానుల్లో ఆందోళన పెరగడంతో… బిసిసిఐ కంగారు అక్కర్లేదని చెప్పింది. కోహ్లి పూర్తి ఫిట్‌గా ఉన్నాడని తీపికబురు అందించింది. మరోవైపు కేదార్ జాదవ్‌ కూడా గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. రెండు వార్మప్ మ్యాచ్‌లకు దూరమైన జాదవ్… నెట్ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. సౌతాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌లో జాదవ్‌ సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని సమాచారం.