ఫ్రాన్స్ లో హుంగామ చేస్తున్న రౌడీ హీరో

SMTV Desk 2019-06-03 16:14:44  Vijay devarakonda,

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన డియర్ కామ్రేడ్ సినిమా, వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, విజయ్ దేవరకొండ ఆ తరువాత సినిమాపై పూర్తి దృష్టిపెట్టాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రధాన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తుండగా, మరో ఇద్దరు కథానాయికలుగా ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఫ్రాన్స్ లో జరుగుతోంది.

నాయకా నాయికలకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ముందే అక్కడకిఫ్యామిలీతో సహా వెళ్ళిన విజయ్ సమ్మర్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఫ్రాన్స్ లో విజయ్ దేవరకొండ కు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె కోసమే విదేశాలకు వెళ్తున్నాడని కూడా అంటున్నారుగుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ విదేశీ వనిత తో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా విజయ్ ఆ ఫారెన్ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నోటా రిలీజ్ టైమ్లో సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటోల్లో విజయ్ ఏకంగా ఆ అమ్మాయిని ముద్దు పెడుతూ కనిపించడంతో అప్పట్లో టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీలు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతున్నాయి. నిజమేమిటో విజయ్ కే ఎరుక.