నిప్పులు విరజిమ్ముతున్న ఎట్నా పర్వతం

SMTV Desk 2019-06-03 15:53:24  Mount Etna

రోమ్: ఇటలీలోని అత్యంత ఎత్తైన అగ్ని పర్వతం ఎట్నా ఆకాశంలోకి నిప్పులు విరజిమ్ముతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియో ఫిజిక్స్ అండ్ వొల్కనాలజీ (ఐఎన్‌జివి) ఈ విషయాన్ని తెలిపింది. గురువారం ఉగ్రరూపం దాల్చిన అగ్ని పర్వతం శనివారం నాటికి తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ, పర్వతారోహకులకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఐఎన్‌జివి పేర్కొంది. ఈశాన్య, దక్షిణ, అగ్నేయ దిశలో రెండు విస్పోటనాల నుంచి లావా విరజిమ్మింది. తాజాగా వెలువడుతున్న లావాతో సమీప ప్రాంతాల్లోని నివాసితులకు గాని, కటానియాకు సమీపంలోకి వచ్చే విమానాలకు ముప్పేమి లేదని తెలిపింది.