శిల్పా.! రాజకీయ సన్యాసం తీసుకో.. : మంత్రి ఆదినారాయణ రెడ్డి

SMTV Desk 2017-08-29 11:34:28  NANDHYALA ELECTIONS, YCP LEADER SHILPA MOHAN REDDY, MARKETING MINISTER AADHI NARAYANA REDDY.

నంద్యాల, ఆగస్ట్ 29 : నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న వైసీపీ నేత శిల్పా మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. నంద్యాల ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాతో మాట్లాడిన మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి పై విధంగా స్పందించారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భూమా కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిమానం, నమ్మకమే భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాయన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలే టీడీపీకి మరింత లబ్ధి చేకూర్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం శిల్పా మోహన్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలని మంత్రి ఆదినారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడి నంద్యాలలో వర్షం కురుస్తుందని, ఇప్పుడదే తుఫాన్ రేపు కాకినాడకు కూడా చేరుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.