వైరల్ వీడియో : మహిళను కాలితో కొట్టిన బీజేపీ లీడర్

SMTV Desk 2019-06-03 15:38:13  bjp, balaram,

బిజెపి ఎంఎల్ఎ బలరాం తవాని ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. నీటి సమస్య పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను బలరాం తవాని కాలితో తన్నారు. మహిళను ఎంఎల్ఎ బలరాం కొడుతుండగా స్థానిక యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బాధితురాలికి ఎంఎల్ఎ బలారం తవాని క్షమాపణలు చెప్పారు. ఇలాంటి వాళ్లు ప్రజాప్రతినిధులను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని కామెంట్లు పెట్టారు. సదరు మహిళతో ఆ ప్రజాప్రతినిధిని తన్నిస్తే ఆ బాధ ఏంటో అతడికి తెలిసేదని పేస్ బుక్ లో కామెంట్లు పెట్టారు నెటిజన్లు.