క్షీణించిన ఇంధన ధరలు!

SMTV Desk 2019-06-03 15:33:45  Petrol, Deseal, Price, New delhi

సోమవారం ఇంధన ధరలు కిందికి దిగొచ్చాయి. పెట్రోల్ ధర 18 పైసలు, డీజిల్ ధర 41 పైసలు క్షీణించింది. హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.75.78కు, డీజిల్ ధర రూ.71.67కు దిగొచ్చింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు క్షీణిస్తూ రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 20 పైసలు క్షీణతతో రూ.71.30కు, డీజిల్ ధర 40 పైసలు క్షీణతతో రూ.65.76కు తగ్గింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 18 పైసలు, డీజిల్ ధర 40 పైసలు దిగొచ్చింది. దీంతో పెట్రోల్ రూ.76.98 వద్ద, డీజిల్ ధర రూ.68.97 వద్ద కొనసాగుతోంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్‌ ధర 18 పైసలు తగ్గుదలతో రూ.75.52కు క్షీణించింది. డీజిల్‌ ధర 40 పైసలు క్షీణతతో రూ.71.04కు తగ్గింది. ఇక విజయవాడలో పెట్రోల్ 18 పైసలు, డీజిల్ ధర 39 పైసలు క్షీణించింది. దీంతో పెట్రోల్ ధర రూ.75.17కు, డీజిల్ ధర రూ.70.72కు తగ్గింది.