సియాచిన్‌లో పర్యటించనున్న రక్షణ మంత్రి

SMTV Desk 2019-06-03 15:28:47  Rajnath Singh,

రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం మొట్టమొదటి సారిగా ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో పర్యటించనున్నారు. పాకిస్థాన్ సరిహద్దుల వెంట భద్రతను ఆయన సమీక్షించనున్నారు. రాజ్‌నాథ్ వెంట ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, రక్షణశాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఉంటారు. సమీప ప్రాంతాలలో కూడా ఆయన సందర్శించనున్నారు. వైమానిక దళంతోపాటు నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బిర్‌సింగ్,14 కార్ప్ కమాండర్, కార్గిల్ యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ జనరల్ వైకె జోషి కూడా భద్రతా పరిస్థితిని రాజ్‌నాథ్‌కు వివరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాజ్‌నాథ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా, కొత్తగా నియమితులైన నావికా దళాధిపతి కరంబీర్ సింగ్‌తో సమావేశం నిర్వహించారు. దేశం ఎదుర్కొంటున్న రక్షణ సవాళ్లు, రక్షణ బలగాల పనితీరుపై వేర్వేరుగా ప్రజెంటేషన్‌కు సిద్ధం కావాలని సైన్యం, వైమానిక, నావికా దళాధిపతులను ఆదేశించారు.