దూసుకుపోతున్న సారా అలీఖాన్.. బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రెడీ

SMTV Desk 2019-06-03 15:22:36  sara alikhan,

సహజంగా హీరోయిన్లకు అవకాశం రావడమే ఆలస్యం వెంటనే ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తుంటారు. ఆ దిశగా వారు అడుగులు పడుతుంటాయి. తాజాగా బాలీవుడ్ లో సైఫ్ ఆలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్ కేదారనాథ్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంతగా ఆడకపోయినా రెండో సినిమా సింబాతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె దశ తిరిగిందనే చెప్పాలి.

ప్రస్తుతం సారా అలీఖాన్ యాడ్స్ లో దూసుకుపోతుంది. పలు రకాల బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రెడీ అయ్యింది. తనకు యాడ్స్ తీసుకొచ్చే బాధ్యతను కాన్వా సంస్థకు అప్పగించిన ఆమె.. ఈ సంస్థ ఆమె కోసం ఏకంగా 11 బ్రాండ్ లను సిద్ధం చేసింది. ఈ 11 బ్రాండ్ ల విలువ దాదాపు రూ.30 కోట్లు అని తెలుస్తోంది. అంటే సినిమాలు కాకుండా ఈ యాడ్స్ ద్వారా సారా సంవత్సరానికి రూ. 30 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందన్నమాట. మొత్తానికి సారా అలీఖాన్ ఏడాదికి కేవలం యాడ్స్ ద్వారానే అంత మొత్తాన్ని గడిస్తుందన్న మాట.