ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి

SMTV Desk 2017-06-03 16:13:50  irland, irland pm, nri, leovardkar

లండన్, జూన్ 3 : ఐర్లాండ్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి లియో వారద్కర్ ఎన్నికయ్యారు. త్వరలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముంబై నివాసి అయిన అశోక్ కుమారుడే వారద్కర్. అశోక్ ఇంగ్లాండ్ లో ఐరిష్ నర్సు మిరియంను పెళ్ళిచేసుకున్నాడు. లియో వారద్కర్ జన్మించడానికి ముందే అశోక్-మిరియం దంపతులు ఐర్లాండ్ కు వలస వెళ్లారు. లియో ఐర్లాండ్ లోనే జన్మించాడు. వైద్యుడిగా స్థిరపడిన లియో 27 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఐర్లాండ్ అధికార పార్టీ ఫైన్ గేల్ లో నాయకత్వం కోసం, తద్వారా ప్రధాని పదవిని అధిష్ఠించడం కోసం జరిగిన ఓటింగ్ లో లియో వారద్కర్ 60 శాతం ఓట్లు సాధించాడు. ఆయన ప్రత్యర్థి సిమోన్ కొవెనీకి 40 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో కొత్త ప్రధానిగా వారద్కర్ పేరు ఖాయమైంది. ఈనెల 13న ఆయన పార్లమెంట్ విశ్వాసం పొందనున్నారు. ఆయనకు మరో ప్రత్యేకత కూడా సమకూరింది.. ఆ దేశంలోనే పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించడంతో పాటు, స్వలింగ సంపర్కుడైన ప్రధానిగా కూడా రికార్డు కేక్కనున్నారు. స్వలింగ సంపర్కుడైన లియో వారద్కర్ జీవిత భాగస్వామి మాథ్యూస్ బర్రెట్ కూడా వైద్యుడే.