అమెరికాపై వెనిజులా మానవ హక్కుల సంఘం ఆరోపణలు

SMTV Desk 2019-06-03 15:10:53  america, Latin america human right commission

కారకాస్‌: అమెరికా దేశంపై లాటిన్‌ అమెరికా మానవ హక్కుల సంఘం తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అమెరికా అంక్షలు వెనిజులాలో క్యాన్సర్‌రోగుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయని వెల్లడించింది. వెనిజులాలో ప్రధాన ఆదాయ వనరుగావున్న ప్రభుత్వరంగ చమురు సంస్థ పిడివిఎస్‌ఎ పై అమెరికా ఆంక్షలు విధించడంతో క్యాన్సర్‌రోగులకు వైద్యచికిత్సలు, సర్జికల్‌ చికిత్సలు, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి ప్రక్రియలన్నీ ఆగిపోయాయి. క్యాన్సర్‌, ఇతర వైద్య చికిత్సలకు అవసరమైన ఆర్థిక సహాయం ప్రభుత్వంనుండి అందకపోవటంతో యువకులు, వృద్ధులు ఇతరరోగులకు ప్రపంచంలో ఎక్కడా వైద్యచికిత్స లభించటం లేదు. పిడివిఎస్‌ఎ, దాని అనుబంధసంస్థల నుండి లభించే నిధులు స్థంభించిపోవటంతో అర్జెంటీనాలో వైద్యసహాయం అందక అక్కడ చికిత్స పొందుతున్న 26 మంది రోగులలో నలుగురు మృత్యువాత పడ్డారని ఈ స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్‌ మరియా యూజెనియా రష్యన్‌ చెప్పారు. నలుగురు రోగుల ఆరోగ్యం స్థిరంగావుండగా మరో 15 మంది పరిస్థితి విషమంగా వుందని ఆయన వివరించారు. అంతేకాక అమెరికాలోకి వలస వచ్చినవారిని సరిహద్దుల్లో నిర్బంధించి జైళ్ల కన్నా దారుణంగా ఉన్న శిబిరాలకు తరలిస్తున్నారు. 35 మంది మాత్రమే ఉండాల్సిన గదిలోకి 155 మందిని కుక్కేస్తున్నారు. శిబిరాల్లో పరిస్థితులు దారుణంగా ఉండడంతో గత ఏడాది సెప్టెంబరు నుంచి ఇంతవరకు ఓ డజను మంది చిన్నారులు చనిపోయారు. గత ఒక్క నెలలోనే ముగ్గురు చిన్నారులు కన్నుమూశారు. మానవ హక్కుల గురించి ఇతరులకు సుద్దులు చెప్పే అమెరికా తన గడ్డపై జరుగుతున్న ఈ దారుణాలకు ఏం సమాధానం చెబుతుందని హక్కుల కార్యకర్తలు నిలదీస్తున్నారు.