ఒప్పో కీలక నిర్ణయం... మొబైల్ ధరలు తగ్గింపు

SMTV Desk 2019-06-02 15:15:40  Oppo, Oppo phones,

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. లేటెస్ట్ మొబైల్స్ అమ్మకాలు పెంచుకోవడానికి ధరల తగ్గింపు మంత్రం పఠిస్తోంది. ఒప్పో ఎఫ్ 11 ప్రీమియం ఫోన్ ఇటీవల విడుదలచేసింది. ఈ మొబైల్ తో పాటు ఒప్పో ఎ5 మోడల్ ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఒప్పో 11 ప్రో మోడల్ అసలు ధర రూ 24,990 కాగా ఈ మోడల్ పై గత నెలలో 2 వేలు డిస్కౌంట్ ప్రకటించింది ఒప్పో.

దీంతో ఆ ఫోన్ రూ 22,990 కి అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మళ్ళీ డిస్కౌంట్ ప్రకటించింది. ఒప్పో 2వేలు డిస్కౌంట్ ప్రకటించడంతో ఈ మోడల్ ఇప్పుడు కేవలం రూ.20.990 కి అందుకోవచ్చు. అతి కొద్దికాలంలోనే ఈ ఫోన్ ధర 4 వేలు తగ్గింది. 6 జీబీ ర్యాం, 64 జీబీ స్టోరేజీ కలిగిన ఒప్పో ఎఫ్ 11 ప్రోకి అందుకోవచ్చు.

దీంతో పాటు ఒప్పో 5 మోడల్ పై కూడా వెయ్యిరూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఒప్పో 5 మోడల్ అసలు ధర 4 జీబీ, 64 జీబీ వేరియంట్ మోడల్స్ రూ 12,990కి అందిస్తోంది. ఈ ఫోన్ పై వెయ్యిరూపాయలు డిస్కౌంట్ అందుబాటులోకి రావడంతో రూ.11,990కే దొరుకుతోంది.

ఈ డిస్కౌంట్ ఒప్పో అధికారిక వెబ్ సైట్ ఆన్ లైన్, ఇతర ఈ కామర్స్ సైట్ల ద్వారా అందుకోవచ్చని ఒప్పో పేర్కొంది. ఒప్పో మార్కెటింగ్ స్ట్రాటజీ వెనుక శాంసంగ్ గేలక్సీ ఎ 50ని దెబ్బకొట్టడానికే అని నిపుణులు చెబుతున్నారు.