మా తెలుగు తల్లికి.....అవమానమా?

SMTV Desk 2019-06-02 13:36:19  CM KCr,

సీఎం ప్రమాణ స్వీకారంలో... ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే ప్రతి సభలోనూ మన "మా తెలుగు తల్లి" పాటతొ ప్రారంభించడం ఆనవాయితీ.. ఈ గేయం అధికారికంగానే రాష్ట్రగేయం కూడా.... ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఇప్పుడున్న నవ్యాంధ్రలో గానీ ఈ పాట లేకుండా ఏ కార్యక్రమమూ జరిగేది కాదు.

అలాంటిది ఈసారి ఒక సీఎం ప్రమాణ స్వీకారంలో "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" పాట ఊసే లేదు..ఇది తెలుగు వారు చేసుకున్న దౌర్భాగ్యమా? తెలుగుతల్లి, ఎవునికి తల్లి ? తెలుగు తల్లి దెయ్యం అని ప్రవచించిన కేసీఆర్ దొర వారి ప్రీతి కొరకేనా..... ఈ తెలుగుతల్లి గేయం రద్దు? ఇదే మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులోనో..... కర్ణాటకలనో...... జరిగి ఉంటే పరిణామాలు మరింత తీవ్రంగా ఉండేవాని....... అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ కొనసాగుతుంది.