కివీస్ లక్ష్యం 137

SMTV Desk 2019-06-02 13:32:30  new zealand, sri lanka,

కార్డిఫ్: వరల్డ్ కప్‌లో భాగంగా కివీస్, శ్రీలంక మద్య జరగుతున్న మ్యాచ్ లో లంక 29.2 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలింగ్ ధాటికి లంక విలవిలలాడింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో లంక కష్టాల్లో చిక్కుకుంది. కరుణరత్నె హాఫ్ సెంచరీతో లంకను ఆదుకున్నాడు. కరుణరత్నెకు ఏ బాట్స్ మెన్ సహకారం అందించకపోవడంతో లంక తక్కువ స్కోర్ నమోదు చేసింది. కరుణరత్నె(52) నాటౌట్, ఎండికెజె పెరీరా(29), ఎన్‌ఎల్‌టిసి పెరీరా (18), లక్మల్ (7), తిరుమన్నె (4), దిసిల్వ(4), మెండీస్(1), మలింగ (1) పరుగులు చేసి ఔటయ్యారు. బికెజి మెండిస్, మాథ్యూస్, ఉదానా పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ ఫరుగుజన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా గ్రాండ్‌హోమ్, నీశమ్, శంట్నార్, బౌల్ట్ తలో ఒక వికెట్ తీశారు.