ఏపీలో 44,000 పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చండి: సీఎం జగన్ ఆదేశం

SMTV Desk 2019-06-02 13:04:26  jagan

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 44,000 ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ప్రతి 40 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేయాలన్న జగన్.. ఇకపై అక్కడి నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని ఆదేశించారు. పాఠశాలలకు తగినంత మంది అధ్యాపకులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఉన్నతాధికారులు సూచించారు.