రంజాన్ రోజున ఒకపూట భోజన వసతి కల్పిస్తున్న ఇండియా గేట్ యాజమాన్యం

SMTV Desk 2019-06-02 13:03:34  India, India Gate basmathi rice,

ఇండియా గేట్ బాస్మతి రైస్ కంపెనీ కొత్తగా లాంఛ్ చేసిన వీడియోకు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో ఈద్‌ సందర్భంగా ఒక వ్యక్తి తన భార్య కొడుకు సహా తన తమ్ముడికి బిర్యానీ తీసుకెళుతుంటారు. దారిలో కారు ఆగిన చోట అందులో ఉన్న పిల్లాడు రోడ్డు పక్కనే ఆడుకుంటున్న పేద పిల్లలను దాన్ని ఇస్తాడు.. అది చూసిన తల్లి అది బాబాయ్‌ కోసం తెచ్చిన బిర్యానీ అంటుండగానే.. బిర్యానీ తీసుకుని తింటూ ఓ పిల్లాడు ఈద్‌ ముబారక్ ఆంటీ అంటాడు. దీంతో ఆ తల్లి కూడా సంతోషంతో పదా.. వెళదాం ఇంకా బిర్యానీ తేవడానికి అంటోంది. ఈద్‌ సందర్భంగా పేద పిల్లల కడుపునింపితే చాలా బాగుంటుందని ఆ యాడ్ సారాంశం. ఇండియా గేట్ బ్రాండ్ గొప్పతనాన్ని వివరిస్తూ తయారు చేసిన ఈ వీడియోకు నెటిజన్లంతా లైకులు మీద లైకులు కొడుతున్నారు.



సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ… ఇండియా గేట్ యాజమాన్యం ఒక్కో షేర్ కు సంబంధించి నిరుపేదలకు రంజాన్ రోజున ఒకపూట భోజన వసతి కల్పిస్తామని ప్రకటించింది.