ఇది ఓ రికార్డే.....ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత పెద్ద కటౌట్ ఏ హీరోకి పెట్ట‌లేదు

SMTV Desk 2019-06-02 13:02:57  suriya fans

హీరో సూర్య టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `ఎన్‌.జి.కె`. శ్రీరాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమా విడుద‌ల‌కు ముందు సూర్య అభిమానులు పెద్ద రేంజ్‌లో వేడుక‌లు నిర్వ‌హించారు. తిరుత్త‌ణిలో 215 అడుగుల కటౌట్‌ను కూడా అభిమానులు ఏర్పాటు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంత పెద్ద కటౌట్ ఏ హీరోకి పెట్ట‌లేదు. ఇది ఓ రికార్డే. అయితే మున్సిప‌ల్ అధికారులు మాత్రం సూర్య అభిమానుల‌కు షాకిచ్చారు. భారీ క‌టౌట్‌కు అనుమ‌తి లేదంటూ ఆ క‌టౌట్‌ను తొలగించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన `ఎన్‌.జి.కె`లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి హీరోయిన్స్‌.