రానా ప్రధాన పాత్రలో 'హిరణ్యకశ్యప'.....మరిన్ని వివరాలు

SMTV Desk 2019-06-02 13:02:04  rana

రానా ప్రధాన పాత్రధారిగా .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హిరణ్యకశిప అనే భారీ పౌరాణిక చిత్రాన్ని చేయనున్నట్టుగా కొంతకాలం క్రితం గుణశేఖర్ చెప్పారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టును గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందేమోనని అంతా అనుకున్నారు.

ఆ సమయంలో సురేశ్ బాబు ఈ సినిమా ఉందనీ .. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని ఓ వేదిక ద్వారా స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు గుణశేఖర్ రంగంలోకి దిగిపోయారు. హిరణ్యకశిప గా రానా చేయనున్నట్టు మరోసారి స్పష్టం చేశారు. మూడేళ్లుగా ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయనీ, త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని అన్నారు. గుణశేఖర్ మాటలను బట్టి, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు ఒక కొలిక్కి వచ్చేసినట్టే కనిపిస్తోంది మరి.