జడేజా ఒక అద్భుత అల్ రౌండర్ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్

SMTV Desk 2019-06-02 11:50:31  jadeja, clarke,

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ క్లార్క్‌ భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పై ప్రశంసల జల్లు కురిపించాడు .. అతను ఒక గొప్ప ఫిల్డర్ అంటూ కితాబిచ్చాడు . ‘ప్రస్తుత క్రికెట్‌లో జడేజాను మించిన ఆల్‌రౌండర్‌, ఫీల్డర్‌ లేడు. అతను ఔట్‌ ఫీల్డ్‌లో పరుగులను అడ్డుకోవడం కానీ, కష్టమైన క్యాచ్‌ అందుకోవడం.. గురిచూసి నేరుగా వికెట్లకు కొట్టడం కానీ అద్భుతం.’ అని ప్రపంచకప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్లార్క్‌ కొనియాడాడు. పరిస్థితులకు తగ్గట్లు జడేజా మైదానంలో కదులుతాడని చెప్పుకొచ్చాడు.

ఇటీవల జరిగిన న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా భారత బ్యాట్స్‌మెన్‌ అంతా చేతులెత్తేయగా.. జడేజా ఒక్కడే(54) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయినా అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు జట్టులో ఉండటంతో జడేజా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇక భారత తన ఆరంభ మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఈ నెల 5న తలపడనుంది