సచిన్‌ ,సెహ్వాగ్‌, గంగూలీ పిక్ వైరల్

SMTV Desk 2019-06-01 14:08:12  Sachin, Ganguly, Sehwag, commentatry

సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, సౌరవ్‌ గంగూలీ ఒకప్పుడు టీమిండియా మూలస్తంభాలు. ప్రత్యర్థులకు ముచ్చె మటలు పట్టించిన ఆటగాళ్లు. ఈ ముగ్గురు కలిసి ఇండియాకు ఎన్నో విజయాలు అందించారు. రెండు దశాబ్దాల పాటు తమ ఆటతో అభిమానులను అలరించి న ఈ త్రయం.. ఇప్పుడు మాటతో మరోసారి ఫ్యాన్స్‌‌కు కనువిందు చేసింది. వీరూ ఇప్పటికే వ్యాఖ్యాతలు వ్యవహరిస్తుండగా
తాజాగా సచిన్‌ టెండూల్కర్‌ కూడా కామెంటేటర్‌ గా మారి కొత్త ఇన్నింగ్స్‌‌ ప్రారంభించాడు. వరల్డ్‌ కప్‌ లో ఇంగ్లండ్‌ , సౌతాఫ్రికా మధ్య తొలి మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జరిగిన టీవీ కార్యక్రమంలో ఎక్స్‌‌పర్ట్‌‌ హోదాలో సచిన్‌ పాల్గొన్నాడు. గంగూలీ, సెహ్వాగ్‌ , హర్భజన్‌ సింగ్‌ తో కలిసి మ్యాచ్‌ పై సమీక్ష జరిపాడు.

సౌరవ్‌ , సెహ్వాగ్‌ తో కలిసి కాసేపు కామెంటరీ బాక్స్‌‌లో కనిపించాడు. ‘సచిన్‌ ఓపెన్స్‌‌ ఎగైన్‌ ’పేరుతో మాస్టర్‌ బ్లాస్టర్‌ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటో, గతంలో ఓ మ్యాచ్‌ లో సచిన్‌ , గంగూలీ క్రీజులో ఉండగా.. మాస్టర్‌ కోసం తాను రన్నర్‌ గా వచ్చి నప్పటి ఫొటోను సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. దానికి ‘కలిసి ఇంకోసారి’ అన్న కాప్షన్‌ ఇచ్చి తన ఆనందాన్ని పంచుకున్నా డు.