కిరాణా సేవల విస్తరణలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్

SMTV Desk 2019-06-01 14:02:57  amazon,

తమ ప్యాంట్రీ సేవలను భారత్‌లోని 110 నగరాలకు విస్తరించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల ప్రకటించింది. గ్రాసరీ కేటగిరీలో తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు ఇది అమెజాన్‌కు ఉపయోగపడనుంది. భారత్‌లో మరింత వేగంగా విస్తరించేందుకు ఇది ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్యాంట్రీ సేవలను వందకు పైగా పట్టణాలకు విస్తరించేందుకు సిద్ధమైంది.వచ్చే ఆరు–ఏడు నెలల్లో ఈ సర్వీసులను 110 పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. గతేడాది నవంబర్‌ నాటికి 40 నగరాల్లో ప్యాంట్రీ సేవలుండగా.. మరో 70 నగరాల్లో సేవలను విస్తరించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సంస్థ గ్రోసరీ విభాగ డైరెక్టర్‌ సౌరభ్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. ప్యాంట్రీ సేవల్లో 500 బ్రాండ్లకు చెందిన.. స్టేపుల్స్, గృహ సరఫరా, వ్యక్తిగత సంరక్షణ వంటి దాదాపు 5,000 ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.