పెట్రా మార్టిక్ సంచలన విజయం

SMTV Desk 2019-06-01 14:00:45  petra martik, tennis,

మహిళల సింగిల్స్‌లో పెట్రా మార్టిక్ సంచలన విజయం సాధించింది. రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్)తో జరిగిన పోరులో 63, 63తో జయకేతనం ఎగుర వేసింది. ప్రారంభం నుంచే పెట్రా ఆధిపత్యం చెలాయించింది. తన మార్క్ షాట్లతో ప్లిస్కోవాకు చుక్కలు చూపించింది. ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేసింది. మరో పోటీలో 9వ సీడ్ ఎలినా స్విటిలోనా ఓటమి పాలైంది. మాజీ చాంపియన్ ముగురుజాతో జరిగిన పోరులో స్విటిలోనా కంగుతింది. ఏకపక్ష పోరులో ముగురుజా 63, 63తో విజయం సాధించింది.