ఆసక్తిని రేపుతున్న 'రాక్షసుడు' టీజర్ - చూడండి!!

SMTV Desk 2019-06-01 13:59:58  bellamkonda

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా రమేశ్ వర్మ రాక్షసుడు సినిమాను రూపొందిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

స్కూల్ పిల్లలను కిడ్నాప్ చేసి .. వాళ్లపై అత్యాచారం చేసి హత్య చేసే ఒక సైకో, ఆ సైకోను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసే ప్రయత్నాలతో ఈ టీజర్ కొనసాగింది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జూలై 18వ తేదీన విడుదల చేయనున్నారు. సీత ఫలితంతో నిరాశ చెందిన బెల్లంకొండకి ఈ సినిమా ఊరట కలిగిస్తుందేమో చూడాలి.