శంషాబాద్‌లో మళ్లీ దొంగ బంగారం చిక్కింది...దుబాయ్‌ ప్రయాణికుడి నుంచి కేజిన్నర స్వాధీనం

SMTV Desk 2019-06-01 13:55:25  dubai

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు మరో కేజిన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోదుస్తుల్లో దాచిన బంగారం తనిఖీల్లో బయటపడింది. దీని విలువ 45 లక్షల రూపాయలు పైనే ఉంటుందని అంచనా. ఇటీవల సంఘటలను పరిశీలిస్తే హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం బంగారం స్మగ్లర్లకు అడ్డాగా మారిందా? అన్న అనుమానం కలుగుతుంది.

కస్టమ్స్‌ అధికారు తనిఖీల్లో ఇక్కడ తరచూ దొంగ బంగారం లభిస్తుండడం అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. నిన్ననే ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్‌ అధికారులు కేజిన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మళ్లీ ఈరోజు కూడా అదే పరిమాణంలో బంగారం లభించడం గమనార్హం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతడిని విచారిస్తున్నారు.