సీబీఐకి జగన్ గ్రీన్ సిగ్నల్.... సమ్మతి ఉత్తర్వులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం!

SMTV Desk 2019-06-01 13:54:51  cbi

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. అభియోగాలు, అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలోనే సీబీఐకి ఇచ్చిన ‘సమ్మతి’ ఉత్తర్వులను రద్దు చేశామని అప్పటి ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పుకొచ్చారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణను ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రద్దు చేయబోతోంది.

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తుంది. అయితే ఇందుకోసం ఆయా రాష్ట్రాలు తమ సమ్మతిని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీబీఐని కేంద్రం రాకీయ వేధింపులకు ఓ ఆయుధంగా వాడుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గతేడాది సీబీఐ సమ్మతి ఉత్వర్వులను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో సమ్మతిని మళ్లీ ఇవ్వనున్నారు.