‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ రచ్చ పై క్లారిటీ ఇచ్చిన వర్మ

SMTV Desk 2019-06-01 12:20:27  Varma,

ఎప్పుడూ వివాదాల్లో వుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తాజాగా ఆయన ప్రకటించిన చిత్రం పేరు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. అయితే సినిమా టైటిల్‌లో రెండు కులాలకు సంబంధించిన ప్రస్తావన రావడంతో కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ సీఎం అయిన తరుణంలో వర్మ ఈ సినిమాను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ద్వారా వర్మ మళ్లీ కులాల కుంపట్లు రగుల్చుతున్నారని, కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు తెరపైకి వచ్చాయి. దీనిపై వర్మ వివరణ ఇచ్చారు.

ఈ చిత్రం కమ్మ వర్గీయులను లక్ష్యంగా చేసుకుని తీస్తున్న సినిమా కాదని స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ అపోహలకు పోవద్దని సూచించారు. తన చిత్రం కమ్మ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని తీయడంలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. తనకు ఏ కులం లేదని, తనకు కులంపై నమ్మకమే లేదని అన్నారు. ఈ తరహా ప్రచారంలో నిజంలేదని పేర్కొన్నారు. విజయవాడలో ఉండే విభిన్న రాజకీయ వాతావరణం ఆధారంగా తన చిత్ర కథ ఉంటుందని తెలిపారు.