బ్రేకింగ్... అమెరికాలో కాల్పులు 11 మంది మృతి

SMTV Desk 2019-06-01 12:18:02  america gunfights, 11 killed

గన్ సంస్కృతికి అమెరికా ప్రజలు నిత్యం బలవుతూనే ఉన్నారు. అమెరికా కాలమాన ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఒక వ్యక్తి వర్జీనియా బీచ్ ప్రాంతంలో తాను గతంలో పనిచేసిన ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించి తన సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పులలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా ఒక పోలీస్ ఆఫీసరుతో పాటు ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు.

విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆ వ్యక్తిని కాల్చి చంపారు. గాయపడిన పోలీస్ ఆఫీసర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో అతనికి ప్రణాప్రాయం తప్పిందని వర్జీనియా బీచ్ పోలీస్ చీఫ్ జేమ్స్ సెర్వెరా తెలిపారు.

హెచ్-1బి వీసాల జారీ, ఉగ్రవాదం, వాణిజ్య సంబంధాలు వంటి విషయాలలో చాలా కటినంగా...చురుకుగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ గన్ సంస్కృతి కారణంగా దేశంలో నిత్యం అనేకమంది ప్రజలు, పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ తుపాకుల అమ్మకాలను నిషేధించలేకపోతున్నారు. అమెరికాలో తుపాకుల తయారీ, అమ్మకాలు చేసే బడా పరిశ్రమలు, బడా వ్యాపారస్తులు ప్రభుత్వాన్ని శాశించేస్థాయిలో ఉండటమే ట్రంప్ నిసహాయతకు కారణమని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం తుపాకుల అమ్మకాలపై ఆంక్షలు, నిషేదం విధించనంతవరకు దేశంలో ఈ నరమేధం కొనసాగుతూనే ఉంటుంది...అమాయకులైనా పసిపిల్లలు, ప్రజలు ఈవిధంగా ప్రాణాలు కోల్పోతూనే ఉంటారు. వాటికి సంబందించిన ఇటువంటి వార్తలను ప్రపంచం చదువుతూనే ఉంటుంది.