ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల

SMTV Desk 2019-06-01 12:10:37  inter results,

రాష్ట్రంలో ఇంటర్‌ పాసైన విద్యార్థుల రీవెరిఫికేషన్‌ ఫలితాలు ఇవాళ(శుక్రవారం) విడుదలయ్యాయి. మార్చి పరీక్షల్లో ఉత్తీర్ణులై.. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి జవాబు పత్రాలను శుక్రవారం ఆన్‌లైన్‌లో ఉంచినట్టు ఇంటర్‌బోర్డు తెలిపింది. వాటిని ఇంటర్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మరో 8వేల జవాబు పత్రాలను అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని తెలిపింది.

ఇంటర్ మార్కుల వ్యవహారం ఎంతో సంచలనం సృష్టించింది. మెరిట్ విద్యార్థులు కూడా కొన్ని సబ్జెక్టుల్లో తప్పినట్టుగా ఫలితాలు వచ్చాయి. ఈ క్రమంలో 20 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన తెలంగాణ ప్రభుత్వం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు అవకాశం కల్పించింది.