ఆ సినిమా చేసినందుకు ఇప్పటికి బాధపడుతున్న!!

SMTV Desk 2019-06-01 12:06:37  bellamkonda

ఇటీవల తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా సీత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కాజల్ జోడీగా రాము పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. ఈ సినిమాను తాను చేయడం తన తండ్రికి ఇష్టం లేదనీ, ఆయన మాట కాదని తాను అంగీకరించినట్టు ప్రమోషన్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పాడు.

సినిమా విడుదలైన తరువాత అటు కాజల్ కి .. ఇటు సోనూసూద్ కి మంచి పేరు వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ కి ఈ సినిమా ఏ విధంగానూ ఉపయోగపడదనే టాక్ వినిపించింది. ఈ సినిమాలో రాము పాత్రను చేసినందుకు బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు బాధపడుతున్నాడట. ఈ విషయంపై సన్నిహితుల దగ్గర ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడట. తండ్రి మాట కాదన్నందుకు ఆయనకి సారీ చెప్పేశాడని వినికిడి. తరువాత సినిమా విషయంలోనైనా శ్రీనివాస్ శ్రద్ధ తీసుకుంటాడేమో చూడాలి.