నిఖిల్ సినిమాకి సీక్వెల్?

SMTV Desk 2019-06-01 12:05:53  karthikeya 2

నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో కార్తికేయ ఒకటిగా కనిపిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకుంది. ఒక వైపున లవ్ ను .. మరో వైపున సస్పెన్స్ ను కలుపుతూ తెరపై ఆవిష్కరించబడిన ఈ సినిమా యూత్ కి బాగా నచ్చేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన హీరోకి .. దర్శకుడికి ఉన్నప్పటికీ అందుకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. రేపు నిఖిల్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శక నిర్మాతలు కార్తికేయ 2 ప్రకటన చేశారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇతర నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. చందూ మొండేటి కార్తికేయ చివరిలోనే సీక్వెల్ వుంటుందనే సంకేతాలనిచ్చాడు. అక్కడి నుంచే రెండవ భాగం మొదలవుతుందన్న మాట.