కేంద్ర సహాయమంత్రిగా సంతోష్ గాంగ్వర్‌

SMTV Desk 2019-06-01 12:04:54  santhosh gangwar,

కేంద్ర సహాయమంత్రిగా సంతోష్ గాంగ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గాంగ్వర్‌ కు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖను కేటాయించారు. దీంతో కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ సహాయ మంత్రిగా సంతోష్‌ గాంగ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నామని, వాటి అమలుకు కృషి చేస్తానని సంతోష్‌ గాంగ్వర్‌ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కార్మికులు, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పారు.