వయనాడ్ లో రాహుల్‌గాంధీ పర్యటన

SMTV Desk 2019-06-01 11:59:45  Rahul gandhi, vayanad,

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎంపిగా గెలిచిన కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో జూన్‌ 7 నుంచి రెండు రోజుల పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు స్థానిక ఓటర్లు, కార్యకర్తలకు రాహుల్‌ ధన్యవాదాలు తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మే 24న ట్విటర్‌ ద్వారా రాహుల్‌ వయనాడ్‌ ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ రాహుల్‌ మలయాళంలో ట్వీట్‌ చేశారు.