మెక్సికో వస్తువులపై 5శాతం పన్ను

SMTV Desk 2019-06-01 11:48:29  5% tax on mexico imported products

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన చేశారు. మెక్సికో నుండి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై 5శాతం పన్నులను విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే మెక్సికో నుండి అక్రమ వలసలను నిదోధించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలిపారు. దీంతో వలసలను నిరోధించలేని పక్షంలో ప్రతి నెలకు 5 శాతం మేర పన్ను పెంచుతామన్న ట్రంప్‌.. అక్టోబర్‌లో 25 శాతానికి చేరుకున్న తర్వాత అదే పన్ను శాతాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమ వలసలు ఆగే వరకు ఈ పన్ను విధింపు నిర్ణయం కొనసాగుతుందని ట్రంప్‌ ట్విటర్‌లో స్పష్టంచేశారు. అంతేకాక అక్రమ వలసల కారణంగా దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తుతాయని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి.