ఈ వారం నష్టాలతో ముగింపు

SMTV Desk 2019-06-01 11:47:38  Sensex, Nifty, Stock market, Share markets

ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ముగించింది. శుక్రవారం ఉదయమ లాభాలతో ప్రారంభమై బెంచ్‌మార్క్ సూచీలు అక్కడే నిలదొక్కుకోలేకపోయాయి. దీంతో చివరకు సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 39,714 పాయింట్లకు క్షీణించింది. ఇక నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 11,923 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రూపాయి లాభపడటం, ముడి చమురు ధరలు పడిపోవడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో మార్కెట్ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైంది. కానీ తర్వాత బ్యాంకింగ్ సహా పలు ఇతర షేర్లలో అమ్మకాలు పెరిగిపోవడంతో మార్కెట్ నష్టాల్లోకి వెళ్లింది.