ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్

SMTV Desk 2019-06-01 11:46:53  flipkart

ఈ - కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ పేరుతో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ ప్రకటించినట్లు కంపెనీ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో ఈఎంఐ ద్వారా ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తోందని కంపెనీ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై రూ. 5 వేల నుంచి రూ. 30 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

64జీబీ వేరియంట్ గూగుల్ పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ రూ. 54,999 లభిస్తోందని సంస్థ తెలిపింది. 64జీబీ ఆపిల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ రూ. 66,499 అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. 3జీబీ, 32జీబీ వేరియంట్ గల నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ రూ. 6,999, ఆనర్ 10 లైట్ 3జీబీ, 32జీబీ స్మార్ట్‌ఫోన్ రూ. 9,999 అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. నోకియా 5.1 స్మార్ట్‌ఫోన్ రూ. 8,199, 4జీబీ, 64జీబీ వేరియంట్ గల శాంసంగ్ గెలాక్సీ జె6 స్మార్ట్‌ఫోన్ రూ. 9,490 అందుబాటు ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. మరికొన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.